కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై శిక్షణ

ABN , First Publish Date - 2020-11-27T04:42:23+05:30 IST

జిల్లాకు కేటాయించిన సివిల్‌ ఉమెన్‌ కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం గురువారం ముగియగా ఈ సందర్భంగా ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సింధుశర్మ మాట్లాడారు.

కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై శిక్షణ
విధులపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

జగిత్యాల టౌన్‌, నవంబరు 26 : జిల్లాకు కేటాయించిన సివిల్‌ ఉమెన్‌ కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం గురువారం ముగియగా ఈ సందర్భంగా ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సింధుశర్మ మాట్లాడారు. బాధ్యతతో విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందితో పోటీ పడి పనిచేయాలని ఎస్పీ సింధుశర్మ అన్నారు. ఉద్యోగంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని సూ చించారు. అధికారుల సూచనల ప్రకారం విధులు నిర్వహిస్తూ ఎలాంటి రిమార్కులు లేకుండా సమయపాలన పాటిస్తూ అప్రమత్తంగా మెలగాలని కోరారు. అనంతరం ఈ పెట్టి, ఈ ఛాలన్‌పై క్షేత్ర స్థాయిలో వారికి అవగాహన కల్పించారు. అంతకు ముందు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జిల్లా పోలీస్‌ అధికారులతో ఎస్పీ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ప్రతాప్‌, డీఎస్పీ ప్రతాప్‌, ఐటీ కోర్‌ ఇన్స్‌ఫెక్టర్‌ సరీలాల్‌, ఆర్‌ఐలు వామనమూర్తి, నవీన్‌, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:42:23+05:30 IST