కరోనా లెక్కల్లో గందరగోళం

ABN , First Publish Date - 2020-07-22T10:44:47+05:30 IST

కరోనా లెక్కలు గందరగోళంగా మారాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో 27 మందికి కరోనా వ్యాధి సోకింది.

కరోనా లెక్కల్లో గందరగోళం

 జిల్లాలో 27 మందికి వైరస్‌ 


 (ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా లెక్కలు గందరగోళంగా మారాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో 27 మందికి కరోనా వ్యాధి సోకింది. స్థానికంగా అందిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా 97 మందికి ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తున్నది.  స్థానికంగా అందిన సమాచారం ప్రకారం  హుజురాబాద్‌ డివిజన్‌లోనే 43, కరీంనగర్‌తోపాటు డివిజన్‌లోని వివిధ మండలాల్లో 54 మంది కొవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది.


అధికారిక బులిటెన్‌లో మాత్రం 27 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ బులిటెన్‌లో సాయంత్రం 5 గంట వరకు అందిన సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తుండడంతో ఈ లెక్కల గందరగోళం ఏర్పడుతున్నట్లు భావిస్తున్నారు. డీఎంహెచ్‌వో అధికారికంగా సమాచారం వెల్లడించకపోవడం ఈ గందరగోళానికి తావిస్తున్నది. 


సుభాష్‌నగర్‌: జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జమ్మికుంట, హుజూరాబాద్‌ ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-22T10:44:47+05:30 IST