కలెక్టరేట్‌ ఎదుట జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-28T10:28:12+05:30 IST

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌ రావుపేట జూనియర్‌ పంచాయతీ కార్యదర్వి టెర్మినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని

కలెక్టరేట్‌ ఎదుట జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

టెర్మినేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

సెల్‌ఫోన్‌ ప్లాష్‌ లైట్లతో రాత్రి వరకు నిరసన

పోలీసుల మోహరింపు, అరెస్టు చేసి ఠాణాకు తరలింపు

ఏకపక్షంగా తొలగించడం తగదు : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల, ఆంధ్రజ్యోతి:(జూలై 27) : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌ రావుపేట జూనియర్‌ పంచాయతీ కార్యదర్వి టెర్మినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన నిర్వహించారు. అధికారులు స్పందించక పోవడంతో రాత్రి తొమ్మిది గంటల వరకు సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లతో నిరసన కొనసాగించారు. దీంతో కలెక్టరేట్‌ వద్దకు పోలీస్‌ బలగాలు భారీగా చేరుకుని   నిరసన కార్యక్రామాన్ని అడ్డుకున్నారు. పంచాయతీ కార్యదర్శులను అరెస్టు చేసి ఠాణాకు తర లించారు. ఈ సందర్భంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నో పనులు చేస్తున్న తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆరోపించారు.  మోహన్‌రావుపేట కార్యదర్శి టెర్మినేషన్‌ వెనక్కి తీసుకుని, హెల్త్‌ కార్డులతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పదించారు.


మోహన్‌రావుపేట గ్రామ పంచాయతీ జూనియర్‌ సెక్రటరీని ఏకపక్షంగా తొలగించడం  సరికాదన్నారు. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక లేఖ రాసి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అనేక సమస్యలు ఎదుర్కుంటు న్నారని, ప్రభుత్వం వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొహిబిషన్‌ మూడేళ్ల నుంచి సంవత్సర కాలానికి తగ్గించి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2020-07-28T10:28:12+05:30 IST