గడువులోగా కొత్త ప్రాజెక్టులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-26T05:26:07+05:30 IST

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామ గుండంలో నిర్మిస్తున్న రెండు కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులను ని ర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సంస్థ ఆర్‌ఈడీ(దక్షిణ) సీవీ ఆనంద్‌ అన్నారు.

గడువులోగా కొత్త ప్రాజెక్టులు పూర్తిచేయాలి
మొక్కను నాటుతున్న ఆర్‌ఈడీ ఆనంద్‌

- కొవిడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి   

- ఎన్టీపీసీ ఆర్‌ఈడీ సీవీ ఆనంద్‌

జ్యోతినగర్‌, నవంబరు 25 : ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామ గుండంలో నిర్మిస్తున్న రెండు కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులను ని ర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సంస్థ ఆర్‌ఈడీ(దక్షిణ) సీవీ ఆనంద్‌ అన్నారు. రామగుండం పర్య టనలో భాగంగా రెండో రోజు బుధవారం వీఐపీ గెస్ట్‌హౌజ్‌ ఆవరణలో ప్రాజెక్టు సీనియర్‌ అధికారులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఈడీ మాట్లాడతూ అత్యాధు నిక అలా్ట్ర సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న తెలంగా ణ సూపర్‌థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) కొవిడ్‌ కార ణంగా పనుల్లో జాప్యం జరిగిందని, అయితే సవరించిన టా ర్గెట్‌  ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించా రు. వచ్చే 2021-22 ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌టీపీపీలోని రెండు యూనిట్లను పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడంలో టీఎస్‌టీపీ పీ కీలక పాత్ర పోషి స్తున్న నేపథ్యంలో నిర్దే శిత లక్ష్యంలోగా నిర్మా ణ పనులు పూర్తి చేసి ఉత్పత్తి దశలో పెట్టాల న్నారు. అలాగే దేశం లోనే అతిపెద్ద ఫ్లోటిం గ్‌ సోలార్‌ ప్రాజెక్టు (100 మెగావాట్లు)ను 2021 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలనన్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మా ణాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాల ను కచ్చితంగా అమలుచేయాలన్నారు. కోవిడ్‌ ఇప్పటికీ వ్యా పిస్తున్న క్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సి బ్బంది వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రామగుండం ఎన్టీపీసీలో నాణ్యమైన విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగేలా చూడాలన్నారు. సమావేశం అనంతరం గెస్ట్‌హౌజ్‌(జ్యోతిభవన్‌) ఆవరణలో మొక్కను నాటారు. అ నంతరం ఆయన ఆక్సిడేషన్‌ ప్లాంటులో ఎన్టీపీసీ ఆద్వర్యం లో చేపట్టిన మియావాకీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ప ర్యావరణ పరిరక్షణకు మియావాకి విధానం ఎంతో ఉపకరి స్తుందని, దీనిని మరింత విస్తరించేందుకు కృషి చేయాలని ఆర్‌ఈడీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రామ గుండం ప్రాజెక్టు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌ కువర్‌, జీ ఎంలు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు. 

Read more