మిషన్‌ భగీరథ పనులు వేసవిలోగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-19T06:17:12+05:30 IST

అర్బన్‌ ప్రాంతాల్లో మిషన్‌ భగీరఽథ పనులు వేసవిలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు.

మిషన్‌ భగీరథ పనులు వేసవిలోగా పూర్తిచేయాలి
జగిత్యాలలో పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

జగిత్యాల కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, నవంబరు 18 : అర్బన్‌ ప్రాంతాల్లో మిషన్‌ భగీరఽథ పనులు  వేసవిలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని రూ. 28.7 కోట్లతో నిర్మిస్తున్న అర్బన్‌ మిషన్‌ భగీరఽథ పనులు బుధవారం పరిశీ లించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో 10 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న మంచి నీటి ట్యాంకు పనులు,  28 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యంతో నిర్మిస్తున్న సంపు, ఫిల్టర్‌ బెడ్‌,  ఎలివెటేడ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పను లను పరిశీలించారు. నాణ్యత పాటించి, లోటు పాట్లు లేకుండా పనులు పూర్తిచే యాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఉప్పరిపేటలో చేపడుతున్న పైపు లైను పనులను పరిశీలించారు. లీకేజీ సమస్య తలెత్తకుండా పనులు చేపట్టాల న్నారు. కొత్త బస్టాండ్‌, నిజమాబాద్‌ రోడ్‌, ధర్మపురి రోడ్‌లలో పైపు లైన్‌ క్రాసింగు కోసం జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి పనులకు అంతరాయం కలుగకుండా చూస్తామని వివరించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్డీవో మాధురి, కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, డీఈ లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-19T06:17:12+05:30 IST