కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు

ABN , First Publish Date - 2020-03-19T11:50:46+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి 

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌


పెద్దపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. బుధ వారం ఆమె చాంబర్లలో సంబంధిత అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. విద్యార్థులు, గర్భిణు లు, అంగన్‌వాడీ కేంద్రంలోకి వచ్చే సమ యంలో, పౌష్టికాహారం అందించే సమ యంలో, కేంద్రాన్ని మూసివేసే సమ యంలో పలుమార్లు చేతులను కడుక్కో వాలని తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో రెండు హ్యాండ్‌వాష్‌లను అం దించాలన్నారు. వంట చేసే పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో పారిశుధ్యం పర్యవేక్షించ డానికి వచ్చే రెండు వారాలపాటు ప్రత్యే క అధికారులను నియమించాలని, 30 అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక ప్రత్యేక అధి కారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించా లని కలెక్టర్‌ ఆదేశించారు. పిల్లలకు, గర్భి ణులకు పౌష్టికాహారం అందించాలని, కోడిగుడ్లు కనీస బరువు 50 గ్రామాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


జి ల్లాలో రూ.4 కోట్లకు పైగా నిధులను అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు అందిం చడానికి ప్రభుత్వం వెచ్చిస్తోందని, సద రు నిధులు సద్వినియోగం అయ్యే విధం గా నాణ్యత ప్రమాణాలు కలిగిన కోడి గుడ్లను తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో అందించే ఇతర పౌష్టి కాహార వివరాలను కలెక్టర్‌ అడిగి తెలు సుకున్నారు. పాలు, పప్పులు, ఇతర సా మగ్రికి సంబంధించి కమిషనర్‌ స్థాయి లో రేట్లు ఫైనల్‌ అవుతున్నాయని, త్వర లో వాటి సరఫరా ప్రారంభమవుతుంద ని కలెక్టర్‌ తెలిపారు. రెండు వారాలపా టు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్‌ ని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అ వగాహన కల్పించాలని, పిల్లలకు, గర్భి ణులకు జాగ్రత్తలను వివరించాలని తెలి పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T11:50:46+05:30 IST