అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-16T05:17:03+05:30 IST

పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మాణ పనులు  వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, డీఆర్‌వో వెంకట మాధవరావులతో కలిసి పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌ నిర్మాణాల పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 188 వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌ చివరి వరకు 50 శాతం వైకుంఠధామాలను పూర్తిచేయాలని, జనవరి వరకు వంద శాతం పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నిర్దేశిత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో నిర్మాణాల పనుల ప్రగతిలో ప్రోగ్రెస్‌ తక్కువగా ఉన్నందున  అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాపూర్‌, మానకొండూర్‌, హుజురాబాద్‌, కేశవపట్నం, వీణవంక మండలాల్లో తొందరగా పనులు ప్రగతిలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జనవరి 15లోపు వైకుంఠధా మాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణాల పనుల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదే శించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, డీఆర్‌వో వెంకట మాధవరావు, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, ఎమ్మార్వోలు, ఈఈ శ్రీనివాసరావు, డీఎల్‌పీవో హరికిషన్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read more