ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి

ABN , First Publish Date - 2020-12-11T05:26:12+05:30 IST

జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు ప్ర భుత్వం అందించే రుణ సదుపాయం సకాలంలో అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ రవి అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 10: జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు ప్ర భుత్వం అందించే రుణ సదుపాయం సకాలంలో అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ రవి అన్నారు. జిల్లాలోని బ్యాంకింగ్‌ రుణ లక్ష్యాలపై వివిధ బ్యాంకు అధికారులతో కలెక్టర్‌ విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద 2016-17, 2017-18 సంవత్సరానికి సంబందించిన 1421 యూనిట్లకు గాను 1400 యూనిట్లు గ్రౌండ్‌ చేశామని, నిధులకు సంబందించి యూసీలను సమర్పించాలని, మరో 21 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో వానాకాలం పంటకు సంబందించి 86763 రైతులకు రూ. 1035 కోట్ల పంట రుణం అందజేయడం లక్ష్యం కాగా, సెప్టెంబరు చివరి నాటికి 73,653 మంది రైతులకు రూ. 783.45 కోట్లు పంట రుణం అందించి 76 శాతం వృధ్ది సాధించినట్లు వివరించా రు. జిల్లాలో ఇప్పటి వరకు 13,587 మంది వీధి వ్యాపారులకు రుణం అందించాలని నిర్ణయించగా 11583 మందికి రుణం మంజూరు చేసి 6008 మందికి రుణాలు అందించామన్నారు. అనంతరం బ్యాంకుల ప నితీరు పురోగతికి సంబంధించిన పలు అంశాలపై సమీక్షించారు. జిల్లా లో 9342 మంది లబ్దిదారులకు సెప్టెంబరు చివరి నాటికి రూ. 176.31 కోట్ల వ్యవసాయ టర్మ్‌ రుణాలు 43.42 శాతం మంజూరు చేశామని వి వరించారు. సూక్ష్మ చిన్నమధ్య తరహా పరిశ్రమల సంరక్షణ కోసం 30 619 లబ్దిదారులకు రూ. 580 కోట్లు టార్గెట్‌ కాగా 3885 మందికి రూ. 117.73 కోట్ల రుణం అందించి కేవలం 19.77 శాతం ప్రగతి సాధించారని వివరించారు. ముద్ర స్కీం కింద 2409 మంది లబ్దిదారులకు రూ. 27.1 కోట్ల రుణం, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద 74 ప్రాజెక్టుల కు రుణం అందించాలని లక్ష్యం పెట్టుకోగా 60 మంది లబ్దిదారులకు రూ .1.52 కోట్ల రుణం మంజూరు చేసామన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద జిల్లాలో 13587 మందికి గాను 11550 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7232 స్వశక్తి సంఘాలకు రూ. 231.86 కోట్ల రుణాలు అందించినట్లు వి వరించారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా కింద 336 స్వశక్తి సంఘాలకు రూ. 12.77 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. కోవిడ్‌ నేపధ్యం లో 5191 మహిళా సంఘాలకు రూ. 283.64 కోట్ల రుణం అందించి అం డగా నిలిచామన్నారు. ఈ కార్యకమ్రంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, లీ డ్‌ బ్యాంక్‌ మే నేజర్‌ గౌతం లక్ష్మి నారాయణ, ఆర్‌బీఐ ఎల్‌డీఎం లనీల్‌ కుమార్‌, డీడీ ఎం నాబార్డు అనంత్‌ ఉన్నారు.


Updated Date - 2020-12-11T05:26:12+05:30 IST