మున్సిపల్‌లో కో ఆప్షన్‌ సందడి

ABN , First Publish Date - 2020-07-10T11:06:53+05:30 IST

సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో కో అప్షన్‌ సభ్యుల ఎన్నికకు గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య నోటిఫికేషన్‌ జారీ చేశారు

మున్సిపల్‌లో కో ఆప్షన్‌  సందడి

సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ 

16 వరకు దరఖాస్తుల స్వీకరణ 

 సిరిసిల్లలో నలుగురికి అవకాశం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో కో అప్షన్‌ సభ్యుల ఎన్నికకు గురువారం  మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 10 నుంచి 16 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌కు నలుగురు కో అప్షన్‌ సభ్యులు గా అవకాశం ఉండగా అందులో రెండు మైనార్టీ లకు, రెండు జనరల్‌కు అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు మహిళలను ఎన్నుకుం టారు. ఇద్దరు జనరల్‌ స్థానాల్లో కో అప్షన్‌ సభ్యులుగా దరఖాస్తు చేసుకునే వారు 21 సంవత్సరాల వయస్సు నిండిన వారై ఉండాలి. సిరిసిల్ల మున్సిపల్‌ పరి ధిలో ఓటరు లిస్ట్‌లో పేరు నమోదై ఉండాలి. 


సిరిసిల్ల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, వార్డు సభ్యులుగా ఐదు సం వత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గతంలో సిరిసిల్ల రెవెన్యూ మండలంలో స ర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వార్డు సభ్యుడుగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వారు కూడా అర్హులు. మున్సిపల్‌ న్యాయ సలహా దారుడుగా 3 సంవత్సరాల అనుభ వం కలిగి ఉన్నవారు. జాతీయ, రాష్ట్ర స్థాయి లో పనిచేసి రిటైర్డ్‌ అయిన గెజిటెడ్‌ ఉద్యోగులుగా ఉండి మున్సిపల్‌ పాలనలో అనుభవం కలిగిన వ్యక్తులు సంబంధి త పత్రాలతో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇద్దరు మైనార్టీ కో అప్షన్‌ సభ్యుల్లో కూడా ఒకరు మహిళకు అవకాశం ఉంటుంది. 21 సంవత్సరాలు నిండి ఉండి ఓటరు లిస్టులో నమోదై ఉండాలి. ముస్లిం, సిక్కులు, క్రిస్టియన్‌, బౌద్ధులు, జిలాస్టియన్‌లు మైనార్టీ కో అప్షన్‌ సభ్యులకు అర్హులుగా పేర్కొన్నారు. 7 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-07-10T11:06:53+05:30 IST