ఆకాశంలో మబ్బులు.. రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2020-11-28T04:17:32+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా మండలంలో ఈదురుగాలులు వీ స్తూ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో రై తులు గబులు చెందుతున్నారు.

ఆకాశంలో మబ్బులు.. రైతుల్లో గుబులు
ముత్తారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై కప్పిన కవర్లు

ముత్తారం నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ కారణంగా మండలంలో ఈదురుగాలులు వీ స్తూ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో రై తులు గబులు చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలు కల్లంలో ఉండడంతో రైతు దిగాలు చెందుతున్నారు. ఓ వైపు తేమ శాతం ఎక్కువ ఉన్నదని ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపి వేయగా, మరోవైపు నివర్‌ తుఫాన్‌ కారణంగా మరింత నష్టపోవాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Read more