టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య తోపులాట

ABN , First Publish Date - 2020-12-31T05:05:55+05:30 IST

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటన జరుగనున్న నేపథ్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
బీజేపీ నాయకుల పై లాఠీఛార్జీ చేస్తున్న పోలీసులు

గొల్లపల్లిలో కమలనాథులపై పోలీసుల లాఠీఛార్జీ

జగిత్యాల, డిసెంబరు 30: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటన జరుగనున్న నేపథ్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జరుపనున్న పర్యటనను అ డ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా పలువు రు బీజేపీ, బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మంత్రి ఈశ్వర్‌ పాల్గొననున్న వాసని గార్డెన్‌ ప్రాంతంలో పలువురు బీజేపీ నాయకులు గుమిగూడారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నం అంజయ్యపై పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి పాల్పడడంతో బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతల ముందస్తు అరెస్టును వ్యతిరేకి స్తూ పలువురు బీజేపీ నాయకులు గొల్లపల్లికి చేరుకుని ఆందోళ న జరిపారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకు ని బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందో ళన చేయడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. లాఠీఛార్జీలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అటు టీ ఆర్‌ఎస్‌ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. ఘర్షణ వాతావరణ నేప థ్యంలో మంత్రి పర్యటన రద్దుకావడం కొసమెరుపు.


Updated Date - 2020-12-31T05:05:55+05:30 IST