ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2020-03-02T11:29:32+05:30 IST

నగరంలో వరదనీటితో ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల్లో కొత్తగా వరదనీటి కాలువలను నిర్మించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

కొత్త వరద నీటి కాలువలను నిర్మిస్తాం

పట్టణ ప్రగతిలో సమస్యల గుర్తింపు 

నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, మార్చి 1: నగరంలో వరదనీటితో ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల్లో కొత్తగా వరదనీటి కాలువలను నిర్మించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.  ఆదివారం పట్టణ ప్రగతిలో భాగంగా ఏడో రోజు 33,59,60 డివిజన్‌లలో మేయర్‌ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 59,60 డివి జన్లలో ప్రధాన సమస్య అయిన వర్షం నీటితో డ్రైనేజీలు నిండి ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి ఇక ముందు ఉండకుండా ప్రణాళికలు తయారు చేయాలని అధి కారులను ఆదేశించారు. డ్రైనేజీలు చిన్నవిగా ఉండటంతో పై నుంచి వచ్చే వరద నీరు ఇళ్లలోకి వచ్చి మంకమ్మతోట, ముకరంపుర, జ్యోతినగర్‌ ప్రాం తాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంకతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. స్మార్ట్‌ సిటీలో 30 నుంచి 40 కోట్ల  రూపాయల నిధు లు కేటాయించి 12 ఫీట్ల వెడల్పుతో పెద్ద డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి, డ్రైనేజీల పైన స్లాబ్‌ నిర్మాణాలు చేపడతామన్నారు.


ఈరెండు డివిజన్లలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ సహ కారంతో త్వరలోనే మూడు ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం పేరిట పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే స్థలం మున్సిపల్‌కు కేటాయిస్తారన్నారు. అక్కడ బర్త్‌డే, మ్యారేజీడే సందర్భంగా, మృతిచెందిన వారి స్మార కార్థంగా కానీ మొక్కలు నాటే అవకాశం కల్పి స్తామని చెప్పారు. దీనితో అక్కడ వారి జ్ఞాపకాలు చిరకాలంగా ఉండడమే కాకుండా ఆహ్లాదకరమైన పార్కుగా కూడా ఆ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. నగరంలో యాభై శాతానికి పైగా  ఖాళీ స్థలాలు ఉన్నాయన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు సమాచారం అందించి వాటిని శుభ్రం చేయాలని కోరామన్నారు. నగరంలో ఇప్పటికే 25 ఎక్స్‌కావేటర్లు, 40 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఖాళీ స్థలాలు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి నెల నగరానికి 2.50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల  రమణరావు, గందె మాదవి, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:29:32+05:30 IST