నీటి సంపులో పడి చిన్నారి మృతి
ABN , First Publish Date - 2020-11-13T10:11:43+05:30 IST
ఒకగానొక్క కూతురు. వచ్చీరాని మాటలతో తల్లిదండ్రుల మదిలోనే కాక చుట్టు పక్కల వాళ్ల మదిలో నిలిచి పోయిన చిన్నారి సాన్వి(3) గురువారం ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతిచెం దింది. సైదాపూర్ మండలం పెర్కపల్లి
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
సైదాపూర్, నవంబరు 12: ఒకగానొక్క కూతురు. వచ్చీరాని మాటలతో తల్లిదండ్రుల మదిలోనే కాక చుట్టు పక్కల వాళ్ల మదిలో నిలిచి పోయిన చిన్నారి సాన్వి(3) గురువారం ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతిచెం దింది. సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామా నికి చెందిన ముత్యాల వెంకటేశ్-అశ్వినిలకు అయిదు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది. వారికి సాన్వి అనే మూడు సంవత్సరాల కూతురు ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి ముందు ఆడుకుంటున్న సాన్వి నీటితొట్టిలో పడి మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.