ప్రతి ఎకరానికి సాగునీరందిస్తాం

ABN , First Publish Date - 2020-12-20T04:28:36+05:30 IST

ప్రతి ఎకరానికి సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు.

ప్రతి ఎకరానికి సాగునీరందిస్తాం
చెక్‌డ్యాం నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

రామడుగు, డిసెంబరు 19: ప్రతి ఎకరానికి సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. శనివారం మండలంలోని రామడుగు, మోతె, గోలిరామయ్యపల్లి గ్రామాల పరిధిలో ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ తెలంగాణ రాకముందు చొప్పదండి నియోజకవర్గం ఎడారిని తలపించేదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం నీళ్లతో చొప్పదండి నియోజకవర్గం సస్యశ్యామలంగా మారింద న్నారు. 

తాను పుట్టిన ఊరు నారాయణపూర్‌ జలాశయం ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందనిన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశా నిర్దేశంలో చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి సూచించిన విధంగా చొప్పదండి నియోజకవర్గానికి 14 చెక్‌ డ్యాంలు మంజూరయ్యాయన్నారు. రామడుగులో మండలంలోనే ఆరు చెక్‌ డ్యాంలు మంజూరు కావడం శుభసూచకమని చెప్పారు. చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయని, దానిద్వారా బావుల్లో, చెరువుల్లో ఎప్పుడూ నీళ్లు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

దేశానికే ఆదర్శంగా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌

చొప్పదండి చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. శనివారం ఆయన చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. గత ఏడాది దేశంలో ఉత్త మ పోలీస్‌ స్టేషన్‌గా చొప్పండి ఎంపికైందని ఆయ న గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో వసతులను పరిశీలించి, స్టేషన్‌ నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిర్వాహణ వివరాలు తెలుసుకున్నారు. కార్య క్రమంలో సీఐ రమేశ్‌, ఎస్‌ఐ వంశీకృష్ణ పాల్గొన్నారు. 

Read more