-
-
Home » Telangana » Karimnagar » Chalco commissioner of hope activists ruined
-
ఆశ కార్యకర్తల ఛలో కమిషనరేట్ భగ్నం
ABN , First Publish Date - 2020-03-13T12:07:07+05:30 IST
తమ న్యాయమైన సమ స్యలను పరి ష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని కమి షనరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని తె లంగాణ వలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశ) యూ నియన్ ఆధ్వర్యంలో చేపట్టారు.

అరెస్టు చేసి ఠాణాకు తరలించిన పోలీసులు
జగిత్యాల టౌన్, మార్చి 12: తమ న్యాయమైన సమ స్యలను పరి ష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని కమి షనరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని తె లంగాణ వలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశ) యూ నియన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇ స్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు రూ.10 వేల ఫిక్స్‌డ్ వేతనాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని సంఘం నిర్ణయిం చింది.
ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎ త్తున ప్రత్యేక వాహనాల్లో ఆశ కార్యకర్తలు తరలివెళ్లేందు కు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జగిత్యాల పట్ట ణ పోలీసులు ఛలో కమిషనరేట్ కార్యక్ర మాన్ని భగ్నం చేసి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. అనంతరం సాయంత్రం సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆశ కార్యకర్తల సంఘం నాయకులు మాట్లా డుతూ బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలని, లె ప్రసీ ఎన్‌సీడీ తదితర పెండింగ్ బిల్లులను వెంటనే చె ల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జాబ్ చార్ట్ ఇచ్చి 6 జతల పెండింగ్ యూనిఫాంలు ఇవ్వాలని కోరారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, తమ సమస్యలు పరిష్కరిం చని పక్షంలో ఈ నెల 19న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.