బీజేపీ శ్రేణుల సంబరాలు

ABN , First Publish Date - 2020-03-12T11:30:50+05:30 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నియమితులు కావడంపై జిల్లాలో పార్టీశ్రేణుల, అభిమానుల సంబరాలు జరుపుకున్నారు.

బీజేపీ శ్రేణుల సంబరాలు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 11: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నియమితులు కావడంపై జిల్లాలో పార్టీశ్రేణుల, అభిమానుల సంబరాలు జరుపుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ సంజయ్‌ నివాసం, ఎంపీ కార్యాలయం, తెలంగాణ చౌక్‌, టవర్‌సర్కిల్‌, కోర్టు చౌరస్తాతోపాటు పలు ప్రధాన కూడళ్లలో పార్టీశ్రేణులు బాణసంచా కాల్చుతూ బ్యాండ్‌ మేళా మధ్య నృత్యాలు చేస్తూ సందడి  చేశారు.


స్వీట్లను పంపిణీ చేశారు. జిల్లా, రాష్ట్ర, నగర నాయకులతోపాటు కార్పొరేటర్లు, అభి మానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంజయ్‌ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మానకొండూర్‌, తిమ్మాపూర్‌, కొత్తపల్లి, వీణవంక, సైదాపూర్‌, చొప్పదండి, రామడుగు, గంగాధరతోపాటు మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామాల్లో పార్టీశ్రేణులు టపాసులు పేల్చి, స్వీట్లను పంపిణీ  చేశారు. 

Updated Date - 2020-03-12T11:30:50+05:30 IST