నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

ABN , First Publish Date - 2020-12-31T04:44:40+05:30 IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడతున్న సీపీ కమలాసన్‌రెడ్డి

 సీపీ కమలాసన్‌రెడ్డి

హుజూరాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,600 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, సీఐ మాధవి, ఎస్‌ఐ చీనానాయక్‌, ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్‌లు నేరేళ్ల మహేందర్‌గౌడ్‌, కొడిగూటి శారద-ప్రవీణ్‌  పాల్గొన్నారు.

జమ్మికుంట రూరల్‌: మండలంలోని విలాసాగర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, సర్పంచ్‌ రమాదేవి, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, పట్టణ సీఐ కె సృజన్‌రెడ్డి, రూరల్‌ సీఐ రాములు, ఎస్‌ఐలు ప్రవీణ్‌రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు. 

తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట: ఎవరైనా తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జమ్మికుంటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందు బాబులను కట్టడి చేసేందుకు నాలుగు రోజులుగా డ్రంకైన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-31T04:44:40+05:30 IST