కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-09-13T10:21:06+05:30 IST

జిల్లాలో మరో 121 మందికి కరోనా వ్యాధి సోకింది.

కరోనా కలవరం

 మరో 121 మందికి పాజిటివ్‌


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మరో 121 మందికి కరోనా వ్యాధి సోకింది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. శనివారం  మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తిచెందడంతో స్థానికులు ఇచ్చిన అనధికారిక లెక్కల ప్రకారంగా 350 వరకు కేసులు నమోదైనట్లు తెలిసింది. హుజురాబాద్‌ మండలంలో 34 మందికి వ్యాధి నిర్ధారణ కాగా జమ్మికుంటలో 38, వీణవంకలో 17, సైదాపూర్‌లో ఆరుగురు, ఇల్లందకుంటలో ఎనిమిది, శంకరపట్నంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. చిగురుమామిడి మండలంలో ఐదుగురికి, గంగాధరలో ఏడుగురికి, తిమ్మాపూర్‌లో 10, చొప్పదండి లో 19, రామడుగులో ముగ్గురికి, మానకొండూర్‌లో 11, గన్నేరువరంలో ఇద్దరికి, కరీంనగర్‌ రూరల్‌లో ఆరుగురికి, కొత్తపల్లిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


కరీంనగర్‌లో..

కరీంనగర్‌ కిసాన్‌నగర్‌లో నలుగురు, సుభాష్‌నగర్‌లో ముగ్గురు, ఆదర్శనగర్‌లో ఇద్దరు, క్రిస్టియన్‌ కాలనీలో ఒకరు, వావిలాలపల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. పద్మశాలివీధిలో ఇద్దరు, హౌజింగ్‌బోరు ్డకాలనీలో ఇద్దరు, మారుతీనగర్‌లో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు, 14వ డివిజన్‌ పరిధిలోని మంకమ్మతోటలో ముగ్గురు, సప్తగిరికాలనీలో ఇద్దరికి కరోనా సోకింది. 15వ డివిజన్‌లోని మార్కండేయనగర్‌లో ఇద్దరికి, 34, 35 డివిజన్‌ పరిధిలోని శ్రీనగర్‌కాలనీలో ముగ్గురికి, సప్తగిరికాలనీలో ఇద్దరికి, 36వ డివిజన్‌ పరిధిలోని మంకమ్మతోటలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. చైతన్యపురిలో ముగ్గురికి, జ్యోతినగర్‌లో ఆరుగురికి, విద్యానగర్‌లో నలుగురికి, భాగ్యనగర్‌లో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-09-13T10:21:06+05:30 IST