కరోనా ఎట్‌దిరేట్‌ ఆఫ్‌ 150

ABN , First Publish Date - 2020-09-06T07:06:47+05:30 IST

జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 150 మందికి కరోనా వ్యాధి సోకింది. ..

కరోనా ఎట్‌దిరేట్‌ ఆఫ్‌ 150

ఇద్దరు మృతి 

గ్రామాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

5న అనధికారిక సమాచారం మేరకు 353 మందికి వ్యాధి నిర్ధారణ 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది.  శుక్రవారం జిల్లావ్యాప్తంగా 150 మందికి కరోనా వ్యాధి సోకింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన బులిటెన్‌లో వెల్లడించింది. శనివారం ఇద్దరు కొవిడ్‌ బారిన పడి మృతిచెందారు. కరీంనగర్‌  భాగ్యనగర్‌కు చెందిన 47 సంవత్సరాల వ్యక్తి నెలరోజులుగా కరోనాతో పోరాడి శనివారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని దుర్శేడ్‌లో నిర్వహించిన హెల్త్‌క్యాంపులో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 45 ఏళ్ల వయసు కలిగిన ఇటుక బట్టీ కార్మికుడు పరీక్షలు చేయించుకొని రిపోర్టు రాక ముందే బట్టీ వద్దకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. అతడికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో బట్టీలోని ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం జిల్లాలో 353 మంది కరోనా బారిన పడ్డారు. 


కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు...: 

చొప్పదండి మండలంలో 12, ఇల్లందకుంటలో 21, తిమ్మాపూర్‌లో 19, సైదాపూర్‌లో 14, హుజురాబాద్‌లో 37, శంకరపట్నంలో 14 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. రామడుగులో 16 మందికి,  గన్నేరువరంలో ఇద్దరికి, చిగురుమామిడిలో ఐదుగురికి, గంగాధరలో ఏడుగురికి, వీణవంకలో 17, కరీంనగర్‌లో 8, కొత్తపల్లిలో 18, జమ్మికుంటలో 28, మానకొండూర్‌ మండలంలో 34 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ బుట్టిరాజారాంకాలనీలో ముగ్గురికి, సుభాష్‌నగర్‌లో ఇద్దరికి, కిసాన్‌నగర్‌లో ముగ్గురికి, ఆదర్శనగర్‌లో ముగ్గురికి, వావిలాలపల్లిలో ఇద్దరికి, శివాజీనగర్‌లో ఇద్దరికి, బ్యాంకు కాలనీలో ఇద్దరికి, క్రిస్టియన్‌ కాలనీలో ఒకరికి, అజ్మత్‌పురాలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.


విద్యానగర్‌లో ఇద్దరికి, భాగ్యనగర్‌లో ఒకరికి, మంకమ్మతోటలో ఐదుగురికి, సప్తగిరికాలనీలో నలుగురికి, తీగలగుట్టపల్లిలో ఏడుగురికి, గణేశ్‌నగర్‌లో ఇద్దరికి, తిరుమల్‌నగర్‌లో ఇద్దరికి, కట్టరాంపూర్‌లో 12 మందికి, భగత్‌నగర్‌లో ముగ్గురికి, రేకుర్తిలో ముగ్గురికి, ఆరెపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎస్సారార్‌ కళాశాల వెనుక  ప్రాంతంలో ఇద్దరికి, చైతన్యపురిలో ఇద్దరికి, ముకరంపురలో కార్పొరేటర్‌తో సహా మరో ఐదుగురికి వ్యాధి సోకింది. హౌసింగ్‌బోర్డుకాలనీలో ఇద్దరికి, మారుతీనగర్‌లో ఇద్దరికి, కట్టరాంపూర్‌లో ఇద్దరు, లక్ష్మీనగర్‌లో నలుగురు వ్యాధి బారినపడ్డారు. 


Updated Date - 2020-09-06T07:06:47+05:30 IST