-
-
Home » Telangana » Karimnagar » Care should be taken in winter
-
శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-06T05:47:26+05:30 IST
శీతకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసు కోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు.

రుద్రంగి డిసెండరు 5: శీతకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసు కోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. మండల కేంద్రంలోని మహా రాష్ట్ర నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉందని, కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధా రణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. మండల వైద్యాఽ దికారి మసూద్, సూపర్‌వైజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.