సినీ ఫక్కీలో వ్యాపారి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-10-07T06:19:44+05:30 IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి చాలాకాలంగా అడ్తీ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌ లోని ఓ వ్యక్తికి

సినీ ఫక్కీలో వ్యాపారి కిడ్నాప్‌

చేజింగ్‌ చేసి పట్టుకున్న పోలీసులు

రూ.2 కోట్లు వసూలు చేసేందుకే తోటి వ్యాపారి పథకం

బకాయిలు వసూలు చేసుకునేందుకే అంటున్న వ్యాపారి


జగిత్యాల, అక్టోబరు, 6 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి చాలాకాలంగా అడ్తీ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌ లోని ఓ వ్యక్తికి మక్కలు విక్రయించగా, ఇందుకు సంబంధించి రూ.2 కోట్లు బకా యి పడ్డాడు. డబ్బులు ఇవ్వకపోగా వాయిదాలు పెడుతూ వచ్చాడు. అయితే కో రుట్ల వ్యాపారిని డబ్బులు చెల్లించాలంటూ స్థానిక రైతులు ఇబ్బందులు పెట్టడం తో గత్యంతరం లేక హైదరాబాద్‌లోని ఆ వ్యాపారిని కిడ్నాప్‌ చేసిన ఘటన జగి త్యాల, హైదరాబాద్‌ జిల్లాల్లో కలకలం రేపింది. కోరుట్ల పట్టణానికి చెందిన దొం తుల రాజభూషణ్‌ అనే వ్యక్తి మక్కలు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని సరూ ర్‌నగర్‌కు చెందిన చాట్ల నాగభూషణంకు రూ.2 కోట్లు విలువ చేసే మక్కలు విక్ర యించాడు. అయితే సదరు వ్యాపారి డబ్బులు ఇవ్వకపోగా వాయిదాలు పెడుతూ వచ్చాడు. దీంతో కోరుట్లకు చెందిన రాజభూషణ్‌పై నుంచి ఒత్తిడి పెరిగింది. స్థానిక రైతులు డబ్బులు చెల్లించాలంటూ ఇంటికి వస్తూ బెదిరించసాగారు. దీంతో గత్యంతరం లేక రాజభూషణ్‌ హైదరాబాద్‌లోని నాగభూషణంను కోరుట్లకు ర ప్పించాలని పథకం రచించాడు. ఈ నెల 5న డబ్బులు ఇస్తానని నాగభూషణం పేర్కొనగా, తెలిసిన ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని నాగ భూషణం ఇంటికి పంపించాడు.


అక్కడ కొంత వాదనలు జరగడంతో ప్రస్థుతం కొంత మొత్తం డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ బలవంతంగా నాగ భూషణంను టీఎస్‌ 08 ఎఫ్‌హెచ్‌ 7577 కారులో కిడ్నాప్‌ చేశారు. హైదరాబాద్‌లో బడా వ్యాపారి కావడంతో వారి బంధువులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. డీజీపీ అప్రమత్తమై అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. నాగభూషణం సెల్‌ సిగ్నల్‌ ట్రాపింగ్‌ ఆధారంగా ఎటువైపు వెళ్తున్నాడో పోలీసులు గుర్తిస్తూ వచ్చారు. చివరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం వైపు వెళ్తున్న ట్లు గమనించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అయితే అందులో ముగ్గురు పోలీసులకు చిక్కగా, ఇద్దరు తప్పిం చుకుని పారిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు వ్యవహారం బయటపడింది. పారిపోయిన ఇద్దరిలో ఒకరు కొడిమ్యాల మండలం లోని చెప్యాల వద్ద పట్టుబడ్డాడు. వారిని విచారించగా బాకీ పడ్డ డబ్బులు వసూ లు చేసేందుకే హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంను కిడ్నాప్‌ చేశామని పేర్కొ న్నట్లు తెలిసింది.


కోరుట్లకు చెందిన రాజభూషణ్‌ చెప్పడంతోనే తాము నాగభూష ణంను తీసుకువచ్చామని పేర్కొనట్లు సమాచారం. అయితే నాగభూషణం బ్యాంక్‌ ఖాతాలో రూ.80 లక్షల మేరకు ఉన్నాయని, వాటిని బలవంతంగా బ్యాంక్‌ నుంచి తీయించడం కోసమే కిడ్నాప్‌ చేయించారని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఈ ఐదుగురు కిడ్నాపర్లకు నేర చరిత్ర ఉండగా, ఇందులో ఒకరు కోరుట్లలో ఏడాదిన్నర క్రితం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. దీనిపై మంగళవారం కోరుట్లకు చెందిన రాజభూషణ్‌ తన కుటుంబసభ్యులతో ఆందోళన చేశారు. రూ.కోటి సరుకు తీసుకుని నాగభూషణం ఇవ్వకపోవడంతో తాను ఇబ్బందులు పడ్డానని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప ట్టించుకోలేదని పేర్కొన్నాడు. నాగభూషణంను తీసుకువచ్చి ఇక్కడి రైతులకు చె ప్పించేందుకే తాను తెలిసిన వ్యక్తులతో ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేశానని, కిడ్నాప్‌ చేయలేదని పేర్కొన్నాడు. 

Read more