-
-
Home » Telangana » Karimnagar » Break for Sridhar continuation as Singareni CMD
-
సింగరేణి సీఎండీగా శ్రీధర్ కొనసాగింపునకు బ్రేక్
ABN , First Publish Date - 2020-12-31T04:59:10+05:30 IST
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పదవీ కాలం పొడిగింపునకు బ్రేక్ పడింది.

- రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం ‘నో’..
- కొత్త సీఎండీపై కోల్‌బెల్ట్‌లో చర్చ
గోదావరిఖని, డిసెంబరు 30: సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పదవీ కాలం పొడిగింపునకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభు త్వం శ్రీధర్ పదవీ కాలం పొడిగించేందుకు సాను కూలత వ్యక్తంచేసినా, కేంద్రం అంగీకరించలేదు. దీంతో సీఎండీ పదవి నుంచి శ్రీధర్ తప్పుకునే పరి స్థితులు ఏర్పడ్డాయి. బుధవారం కొత్తగూడెంలో జరి గిన సింగరేణి 99వ వార్షిక జనరల్‌బాడీ సమావేశం లో అనేక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈసందర్భంగా సీఎండీ గా శ్రీధర్‌ను కొనసాగించేందుకు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ బొగ్గు మం త్రిత్వ శాఖ డైరెక్టర్ వ్యతిరేకించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ఇంధన వనరుల శాఖ శ్రీధర్ పదవీకాలం పొడిగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్ప టికీ, 49 శాతం వాటా ఉన్న కేంద్రం అనుమతి తప్పనిసరి. 2015 జనవరి 1న సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా రెండేళ్ళ కాల పరిమితితో సింగరేణి సీఎండీ నియామకం ఉంటుంది. 2016 డిసెంబరు 31తో పదవీకాలం ముగిసినా, విడతల వారిగా శ్రీధర్ పదవీకాలం పొడిగిం చారు. కాగా శ్రీధర్ పదవీకాలం పొడిగింపునకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుమతి లేదని కార్మిక సంఘాల నాయకులు కోర్టులో కేసులు వేయ డంతో పాటు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. 2015 జనవరిలో సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్, గురువారంతో ఆరేళ్ళ సర్వీస్ పూర్తికానున్నది. సింగరేణికి అత్యధిక కాలం చైర్మన్‌గా కొనసాగిన అధికారిగా శ్రీధర్ నిలి చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణికి ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ సీఎండీగా నియమితులయ్యారు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్‌లకు సింగరేణి బాధ్య తలు అప్పగించే సంప్రదాయం ఉన్నా, తెలంగాణవాసి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్‌కు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. కాగా నూతన సీఎండీగా ఎవరిని నియమిస్తారనే దానిపై సింగరేణితో పాటు రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.