సాగులో ఖర్చు తగ్గించుకోవాలి

ABN , First Publish Date - 2020-11-07T10:33:35+05:30 IST

రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించి ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు

సాగులో ఖర్చు తగ్గించుకోవాలి

 రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి  వినోద్‌కుమార్‌ 


సైదాపూర్‌, నవంబరు 6: రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించి ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి  వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ కుమార్‌, కలెక్టర్‌ శశాంకతో కలిసి నేషనల్‌ ఫర్టిలైజర్‌ లిమిటెడ్‌ ఆధ్వ ర్యంలో సైదాపూర్‌ మండలం గొడిశాల గ్రామ రైతులకు పత్తి తీసే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. యంత్రం పనితీరును  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినోద్‌ కుమార్‌ మాట్లాడు తూ  రైతులు తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట సాగు చేస్తారని, వారికి పని భారంతో పాటు కూలీల కొరత అధిగమించేందుకు ఈ యంత్రం ఎంతో దోహదం చేస్తుందన్నారు. పత్తి తీసే యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌  చింత లత-కుమార్‌,  హు జూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌  భర్మావత్‌  రమ- యాదగిరి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, ఆర్డీవో బెన్‌ సాలెమ్‌, హుజూరాబాద్‌ ఏడీఏ అదిరెడ్డి, ఎల్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌  కొత్త తిరుపతిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కోఆర్డినేటర్‌ రావుల రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయాధికారి వైదేహి, ఎంపీటీసీ గాజర్ల భాగ్య-ఓదెలు, సర్పంచ్‌లు గాజర్ల సదానందం, మిడిదొడ్డి సరిత-రమేష్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T10:33:35+05:30 IST