వ్యవసాయ చట్టంతో..రైతులకు స్వేచ్ఛ

ABN , First Publish Date - 2020-10-12T11:23:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు స్వేచ్ఛ లభించనుందనని

వ్యవసాయ చట్టంతో..రైతులకు స్వేచ్ఛ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌


కరీంనగర్‌ రూరల్‌, అక్టోబర్‌ 11: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు స్వేచ్ఛ లభించనుందనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని నగునూర్‌ గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తు కరపత్రాల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రైతులు తాము పండించిన పంటలకు వారే ధరలు నిర్ణయించే స్వచ్చను కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం ద్వారా కల్పించిందన్నారు.


గ్రామాలలో సీడ్‌ కంపెనీలు వచ్చి సాదా ఒప్పందాలు చేసుకుని రైతులను నష్ట పరిచే వారన్నారు. నూతన చట్టం ప్రకారం ఒప్పందం ప్రకారం కంపెనీలు నడుచుకోక పోతే కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వీలు దక్కుతుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రధాని ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌, వాసుదేవరెడ్డి, మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-12T11:23:01+05:30 IST