గ్రేటర్‌లో గెలుపుపై జగిత్యాల జిల్లాలో బీజేపీ సంబరాలు
ABN , First Publish Date - 2020-12-06T05:21:56+05:30 IST
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంపై శనివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
జగిత్యాల అర్బన్, డిసెంబరు 5: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంపై శనివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించిందని, ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, పాలనాతీరుకు చెంపపెట్టు అని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగిల్ల సత్యనారాయణ, కృష్ణహరి, దశరథరెడ్డి, ఎండబెట్ల వరుణ్‌కుమార్, నలువాల తిరుపతి, కొక్కు గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.