బీజేపీ నాయకుల మౌనదీక్ష
ABN , First Publish Date - 2020-11-03T10:53:22+05:30 IST
బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ సోమవారం తెలంగాణచౌక్‌లో మూతికి నల్లగుడ్డ కట్టుకొని మౌనప్రదర్శన చేపట్టారు
గణేశ్‌నగర్, నవంబరు 2: బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ సోమవారం తెలంగాణచౌక్‌లో మూతికి నల్లగుడ్డ కట్టుకొని మౌనప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగే కార్యక్రమం చేయబోతుందని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ సమావేశం లేనప్పటికీ ఉన్నట్టు సృష్టించి బీజేపీ కార్యకర్తలు, నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టుచేసి పోలీస్టేషన్‌లో నిర్బంధించారన్నారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.