-
-
Home » Telangana » Karimnagar » bitter experience for the people representatives during mlc kavitha tour
-
ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులకు చేదు అనుభవం
ABN , First Publish Date - 2020-12-28T05:09:52+05:30 IST
మండల కేంద్రంలో ఆది వారం ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను చేదు అనుభవం ఎదురైంది.

కమాన్‌పూర్, డిసెంబర్ 27 : మండల కేంద్రంలో ఆది వారం ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఆదివరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పూజల అనంతరం ఆలయ సిబ్బందికి స్థానిక ప్రజాప్రతినిధులకు వాగ్వాదం జరిగింది. తమకు కార్యక్రమ సమాచారం ఇవ్వక పోవడంతో పాటు ఎమ్మెల్సీ కవితను సన్మా నించేందుకు ఈవో ప్రాదాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమను అగౌరవపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలయానికి వస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వరా? అంటూ ప్రజాప్రతినిధులు ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది.