దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-12-28T05:21:19+05:30 IST

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య కురుమ జీవిత చరిత్రను పాఠ్యంశంలో చేర్చాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మండల ంలోని జోగాపూర్‌లో దొడ్డి కొమురయ్య కురుమ విగ్రహాని ఆదివారం మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమతో కలసి ఆవిష్కరించారు.

దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

చందుర్తి, డిసెంబరు 27: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య కురుమ జీవిత చరిత్రను పాఠ్యంశంలో చేర్చాలని  ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మండల ంలోని జోగాపూర్‌లో దొడ్డి కొమురయ్య కురుమ విగ్రహాని ఆదివారం మాజీ  జడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు ఆన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతీ ఒక్కరు విద్యావం తులైనప్పుడే అన్నింటా ముందు ఉంటా రన్నారు. పిల్లలను గొర్రెల కాపర్లుగా మార్చ వద్దని, పాఠశాలలకు పంపించాలని అన్నారు.    అప్పుడే రాజకీయంగా,  ఆర్థికంగా ముందుకు వెళ్తామన్నారు. త్వరలోనే కురుమలకు గొర్రెలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర పభుత్వం సిద్ధమవుతోందన్నారు. ట్యాంక్‌ బండ్‌పై దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటును  సీఎం కేసీఆర్‌  దృష్టికి తీసుకెళ్తానన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మ్యాకల పర్శరాములు, జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్‌, ఎంపీటీసీ మ్యాకల గణేష్‌, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం, బీర్ల ఐలయ్య,  విజయ్‌ ప్రశాంత్‌, మ్యాకల ఎల్లయ్య, వస్తరి శంకర్‌, ఎనుగుల శ్రీనివాస్‌, చిర్ర చందు, నాగం శ్రీనివాస్‌, గంట మల్లేశం, నాగం రాజమల్లయ్య, కనకయ్య, మీస బీరయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-28T05:21:19+05:30 IST