-
-
Home » Telangana » Karimnagar » Bhumipuja for Paddampeta RR Colony
-
పెద్దంపేట ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి భూమిపూజ
ABN , First Publish Date - 2020-12-29T04:46:46+05:30 IST
పెద్దంపేట పునరావాస కాలనీకి జడ్పీ చైౖర్మన్ పుట్ట మధు సోమవారం భూమిపూజ చేశారు.

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 28: పెద్దంపేట పునరావాస కాలనీకి జడ్పీ చైౖర్మన్ పుట్ట మధు సోమవారం భూమిపూజ చేశారు. ఓసీపీ-3 వి స్తరణతో పెద్దంపేట గ్రామాన్ని తరలించేందుకు సింగరేణి యాజమా న్యం ఇచ్చిన పరిహారంతో కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్ శివారు లో గ్రామస్థులు 116 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హో మం, బొడ్రాయి ఏర్పాటు, భూమి పూజలను వేదపండితులు శాస్త్రోక్తం గా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పుట్ట మధు రిబ్బన్ కత్తిరించి గ్రామ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి విస్తరణకు పెద్దంపేట వాసుల సహకారం మరు వలేనిదని, పారిశ్రామిక అభివృద్ధికి సహకరించిన గ్రామస్థుల త్యాగం వె లకట్టలేనిదని పుట్ట మధు పేర్కొన్నారు. పుట్టిన ఊరును వదిలి వేరేచోట స్థిరపడడం బాధాకరమైన విషయమే అయినా రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైన విద్యుత్ అవసరాలు తీర్చేలా బొగ్గు పరిశ్రమ విస్తరణ అందరి బాధ్యతని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణిపరంగా ఎటువంటి సహకా రం అవసరం ఉన్నా తనను సంప్రదించాలని గ్రామస్థులకు పుట్ట మధు సూచించారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైల జ, సర్పంచ్ చింతపట్ల నాగరాజు, ఎంపీటీసీ కామ శ్రీనివాస్, ఉపస ర్పంచ్ రాజేందర్, లక్ష్మి, కుమార్, ముస్తఫా, కర్రు శ్రీనివాస్, కామ శ్రీని వాస్, గంధం శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు.