అంగరంగవైభవం.. భీమేశ్వరుని రథోత్సవం

ABN , First Publish Date - 2020-02-12T12:02:27+05:30 IST

రాయికల్‌ భీమేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి రథోత్సవం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది. ఫిబ్రవరి 9నుంచి జరుగుతున్న జాతర ఉత్సవాలు రథోత్సవంతో ముగిసాయి.

అంగరంగవైభవం.. భీమేశ్వరుని రథోత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు



రాయికల్‌, ఫిబ్రవరి 11: రాయికల్‌ భీమేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి రథోత్సవం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది. ఫిబ్రవరి 9నుంచి జరుగుతున్న జాతర ఉత్సవాలు రథోత్సవంతో ముగిసాయి. రాయికల్‌, కోరుట్ల, మేడిపెల్లి, మల్లాపూర్‌, జగిత్యాల మండలాల నుంచివేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉదయంనుంచిఆలయానికి తరలివచ్చి క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవవిగ్రహాలకు ప్రత్యేకపూజల అనం తరం రథంపైకి చేర్చి రథాన్ని లాగారు. వేలాదిమంది భక్తులు పోటీపడి దేవాలయం చుట్టూ ఐదుసార్లు రథాన్ని లాగి  మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా  ఎస్‌ఐ ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల పూజలు

భీమేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వీరిని సన్మానించారు. కాగా మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్‌పర్శన్‌ గండ్ర రమాదేవి అచ్యుత్‌రావు, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, కౌన్సిలర్లు తురగశ్రీధర్‌రెడ్డి, వల్లకొండ మహేష్‌, మారంపెల్లి సాయికుమార్‌, శ్రీరాముల సువర్ణ సత్యనారా యణ, ఎలిగేటి దివ్య అనీల్‌, మహేంధర్‌, మ్యాకల కాంతారావు, మ్యాకల అనురాధ రమేష్‌, కల్లెడ సునీతధర్మపురిలు ప్రత్యేక పూజలు  నిర్వహించారు.  

Updated Date - 2020-02-12T12:02:27+05:30 IST