ఏడాదిలోగా బెటాలియన్‌ నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2020-03-13T12:12:48+05:30 IST

17వ పోలీస్‌ బెటా లియన్‌లో ఏడాదిలోగా భవనాలను పూర్తి చేయను న్నట్లు, 2021లో పోలీసులకు శిక్షణ అందించనున్నట్లు బెటాలియన్‌ అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్ట్‌ అన్నారు.

ఏడాదిలోగా బెటాలియన్‌ నిర్మాణం పూర్తి

 2021లో పోలీస్‌లకు శిక్షణ

కమాండెంట్‌ కంట్రోల్‌ భవనానికి రూ.7.50 కోట్లు

తుపాకుల భదత్ర బ్యారెక్‌ ఏర్పాటుకు రూ.2.50 కోట్లు

బెటాలియన్‌ అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్ట్‌ 

17వ పోలీస్‌ బెటాలియన్‌లో అభివృద్ధి పనులకు భూమిపూజ 


సిరిసిల్ల రూరల్‌, మార్చి 12: 17వ పోలీస్‌ బెటా లియన్‌లో ఏడాదిలోగా భవనాలను పూర్తి చేయను న్నట్లు, 2021లో పోలీసులకు శిక్షణ అందించనున్నట్లు  బెటాలియన్‌ అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్ట్‌ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీస్‌ బెటాలియన్‌లో గురువారం  వివిధ అభివృద్ధి పనులను భూమి పూజ చేశారు.   సీఅర్‌ఈ ఫ్యాబ్రికేటేడ్‌ బ్యారేక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌, పరేడ్‌గ్రౌండ్‌, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను ప్రారంభించారు.అనంతరం బెటాలియన్‌లో నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీజీపీ అభిలాషబిస్ట్‌ మాట్లాడుతూ 17వ బెటాలియన్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మం జూరయ్యాయన్నారు. ప్రస్తుతం బెటాలియన్‌ కమాం డెంట్‌ కంట్రోల్‌ భవన నిర్మాణానికి రూ.7.50 కోట్లు, తుపాకులను భదత్ర పరిచే బ్యారెక్‌ నిర్మాణానికి రూ 2.50 కోట్లు, బెల్‌ అఫ్‌అర్మ్స్‌కు రూ.4.25 కోట్లు, నీటి సరఫరాకు రూ.కోటి చొప్పున మంజూరవడంతో  టెండ ర్లు పూర్తయ్యాయన్నారు.


2021లో బెటాలియన్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు, ఇక్కడే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అగ్గిరాములు, బెటాలియన్‌ అడిష నల్‌ కమాండెంట్‌ పెద్దబాబు, అసిస్టెంట్‌ కమాండెం ట్‌లు కళిదాస్‌, నరేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు సురేష్‌, రమేష్‌, శంకర్‌, రాజేందర్‌, ఽశంకర్‌, శ్రీధర్‌, మోతీరాం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-13T12:12:48+05:30 IST