కోరుట్లలో వైభవంగా పదునెట్టాంబడి మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-28T04:41:12+05:30 IST

స్వామియే శరణం అయ్యప్ప... నామస్మరణతో కోరుట్ల పట్టణం ఆదివారం పులకరించిపోయింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో జరిపే మండల పూజను పురస్క రించుకొని జాతరోత్సవాన్ని పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో వెలిసిన జ్ఞాన సరస్వతి, శనైశ్చరస్వామి, అయ్యప్ప దేవాలయంలో రంగరంగ వైభవంగా నిర్వహించారు.

కోరుట్లలో వైభవంగా పదునెట్టాంబడి మహోత్సవం
అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్న స్వాములు

కోరుట్ల, డిసెంబరు 27: స్వామియే శరణం అయ్యప్ప... నామస్మరణతో కోరుట్ల పట్టణం ఆదివారం పులకరించిపోయింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో జరిపే మండల పూజను పురస్క రించుకొని జాతరోత్సవాన్ని పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో వెలిసిన జ్ఞాన సరస్వతి, శనైశ్చరస్వామి, అయ్యప్ప దేవాలయంలో రంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరుట్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, వివిధ మండలాలకు చెందిన భక్తులు అయ్యప్ప స్వాములు వేల మంది హాజరై అయ్యప్ప జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు పాలెపు రాంశర్మ, వినయ్‌, కపిల్‌ వేదమంత్రోత్చరణల మధ్య ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో పదునెట్టాంబడి మహోత్సవం వైభవంగా నిర్వహించారు.  జాతర మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ - సరోజన హాజరై స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సంద ర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం దేవాల యంలో సుప్రభాత సేవలతో మొదలుకొని అయ్యప్ప, సుబ్రహ్మణ్యం, గణపతి స్వామి ఉత్సవమూర్తులకు అర్చనలు, పన్నీరాభిషేకాలు  నిర్వహించారు. అనంతరం పదునెట్టాంబడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల భక్తి గీతాలు అలరించాయి. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథం ద్వారా అల్లమయ్యగుట్ట ప్రాంతంలో శోభయాత్ర నిర్వహించారు. ఆలయ ప్రాంతంలో మహీషి మర్థనం నిర్వహించారు. స్వామి వారికి పట్టణంలోని వివిధ దేవా లయాలు, అయ్యప్ప నిలయాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు వస్ర్తాలను బహూకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి, శనైశ్వర స్వామి అయ్యప్ప దేవాలయ అయ్యప్ప అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్‌ చైర్మెన్‌ అన్నం లావణ్య - అనిల్‌, వైస్‌ చైర్మెన్‌ గడ్డమీది పవన్‌లతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:41:12+05:30 IST