-
-
Home » Telangana » Karimnagar » Attacks by excise officers on gangs
-
తండాల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు
ABN , First Publish Date - 2020-11-25T05:45:16+05:30 IST
వీర్నపల్లి మండలంలోని బా బాయ్‌చెరువు తండా, వీర్నపల్లి తండాలలో మంగళవారం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేసి బెల్లంపాకం ధ్వంసం చేశామని సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ తె లిపారు.

వీర్నపల్లి, నవంబరు 24: వీర్నపల్లి మండలంలోని బా బాయ్‌చెరువు తండా, వీర్నపల్లి తండాలలో మంగళవారం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేసి బెల్లంపాకం ధ్వంసం చేశామని సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ తె లిపారు. మండలంలోని తండాల్లో దాడులు నిర్వహించి కేలోతు దూరవ్వ, ముడావత్ లక్ష్మి, ముడావత్ శాంతి, ముడావత్ మమతలు నాటు సారా తయారీ చేస్తున్నట్లు తేలడంతో వారిని తహసీల్దార్ అబ్దుల్ మజీద్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.
గంభీరావుపేట/కోనారావుపేట: మండలంలోని ముచ్చర్ల తండా సమీపాన మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వ హించారు. ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు పక్క సమాచారం మేరకు సో దాలు జరపగా, నాటుసార తయారీకి ఉపయోగపడే 150 లీటర్ల బెల్లం పానకం లభ్యమైంది. లభ్యమైన బెల్లం పానకాన్ని ద్వంసం చేసి, బాధ్యులపై కేసు నమోదు చేశా రు. లక్ష్మిపూర్, నాగంపేట, ముచ్చర్ల తండాలకు చెందిన పలువురిని, కోనారావుపేట మండలం తహసీల్దార్ ఎదు ట గుగ్లోతు చిలుక, సరోజ, సుగుణ, శాంతి, గేరీలను బైం డోవర్ చేసినట్టు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ట్రైనీ ఎస్సై శ్రీకాంత్, హెడ్ కానిస్టేబులు హఖానీ, కానిస్టేబుల్లు రా జేందర్, కృష్ణానాయక్, పరశురాం, రూప పాల్గొన్నారు.