కళలను భవిష్యత్‌ తరాలకు అందించాలి

ABN , First Publish Date - 2020-12-27T04:33:22+05:30 IST

కళలను ప్రోత్సహించాలని, భవిష్యత్‌ తరాలకు అందించా లని ముంబయి అభయ ఇంటర్నేషనల్‌ డాన్స్‌ అకాడమి, రాఽధామోహన్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ రాఽధామోహన్‌ అన్నారు. శనివారం సిరి సిల్లలోని సినారె కళామందిరంలో శ్రీలంబోదర కల్చరల్‌ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వ ర్యంలో 5వ ఉమ్మడి తెలుగు రాష్ట్రస్థాయి బాలల కళోత్సవాలు నిర్వహించారు.

కళలను భవిష్యత్‌ తరాలకు అందించాలి
నృత్యం చేస్తున్న చిన్నారి

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 26: కళలను ప్రోత్సహించాలని, భవిష్యత్‌ తరాలకు అందించా లని  ముంబయి అభయ ఇంటర్నేషనల్‌ డాన్స్‌ అకాడమి, రాఽధామోహన్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌   డాక్టర్‌ రాఽధామోహన్‌ అన్నారు. శనివారం సిరి సిల్లలోని సినారె కళామందిరంలో శ్రీలంబోదర కల్చరల్‌ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వ ర్యంలో 5వ ఉమ్మడి తెలుగు రాష్ట్రస్థాయి బాలల కళోత్సవాలు నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన రాధామోహన్‌ మాట్లాడుతూ కళాకా రులు కళలను పెంపొందించుకోవాలని, వాటిని కింది స్థాయి వారికి అందించాలని అన్నారు.  కళాకారులకు ఎటువంటి ఆస్తులు ఉండవని, వారికి ప్రేక్షకుల చప్పట్లే ఆస్తులని అన్నారు.  వరంగల్‌ పుట్టి కళలను నేర్చుకున్నట్లు, ప్రస్తుతం ముంబాయిలో డ్యాన్స్‌ అకాడమీని నెలకొల్పినట్లు చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఎవరైనా కళాకారులు తన వద్దకు వస్తే సహాయ సహ కారాలు అందిస్తానన్నారు. అనంతరం కార్య క్రమాన్ని ప్రారంభించారు.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌  నుంచి 70 మంది కళాకారులు ప్రద ర్శనలు ఇచ్చారు.  అనంతరం విజేతలతోపాటు వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి ఉత్తమ సేవారత్న పురస్కారాలను అందజేశారు.   కార్యక్రమంలో అభినవ కూచిపూడి నాట్య నిలయం భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన డాక్టర్‌ శాంతిమోహన్‌, హైదరాద్‌కు చెందిన భరత నాట్య చార్యులు, నాట్యశిరోమణి అవార్డు గ్రహీత పోతిని శ్రీనివాస్‌, విశాఖపట్నానికి చెందిన కళారాధన మ్యూజిక్‌ డ్యాన్స్‌ అకాడమికి చెందిన సందీప్‌ కుమార్‌, శ్రీలంబోదర కల్చరల్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్క కళా అశోక్‌, ఉపాధ్యక్షులు కొత్వాల్‌ సాయి ప్రశాంత్‌, గౌరవ అధ్యక్షులు గుగ్గిల్ల జగన్‌గౌడ్‌, దుమాల శ్రీకాంత్‌, ఉపాధ్యక్షులు పొందుర్తి ధర్మేదర్‌, డాక్టర్‌ లీలా శిరీష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T04:33:22+05:30 IST