రోజూ మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2020-04-07T10:24:47+05:30 IST

నగరంలో ప్రతి రోజూ శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి

రోజూ మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయండి

మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి 


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 6: నగరంలో ప్రతి రోజూ శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక దిగువ మానేరు రిజర్వాయర్‌ (ఎల్‌ఎండీ) సమీపంలోని నగరపాలకసంస్థ 34 ఎంఎల్‌డీ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. మోటారు పంపుల పనితీరు, ఫిల్టర్‌ బెడ్ల సామర్థ్యం, సంపులు, నీటి శుద్ధి విధానాన్ని ఎస్‌ఈ భద్రయ్యతో కలిసి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరం పాటించాలని కమిషనర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. సోమవారం స్థానిక 7వ డివిజన్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ కూరగాయల మార్కెట్‌ను, కాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. 

Read more