ఒకటి నుంచి ‘ఆరోగ్యలక్ష్మి’ ప్రారంభించాలి

ABN , First Publish Date - 2020-11-26T05:48:40+05:30 IST

జిల్లా లోని అన్ని ప్రాఽథమిక, అర్బన్‌, ఉప ఆరోగ్య కేంద్రాల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆరోగ్యలక్ష్మి పఽథకాన్ని ప్రారంభించాలని, పరీ క్షల కోసం వచ్చే గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఒక్క పూట భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్‌ అంజయ్య అధికారులను ఆదేశించారు.

ఒకటి నుంచి ‘ఆరోగ్యలక్ష్మి’  ప్రారంభించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అంజయ్య

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 25: జిల్లా లోని అన్ని ప్రాఽథమిక, అర్బన్‌, ఉప ఆరోగ్య కేంద్రాల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆరోగ్యలక్ష్మి పఽథకాన్ని ప్రారంభించాలని, పరీ క్షల కోసం వచ్చే గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఒక్క పూట భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్‌ అంజయ్య  అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో  సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవనంలో బుధవారం సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, మెడికల్‌ అధికారులు, ఏఎన్‌ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం ప్యాకెట్లను అందించాలని, రిజిష్ట్రర్‌లలో నమోదు చేయాలని సూచించారు.జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో రజిత, సీడీపీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T05:48:40+05:30 IST