అర్ధంతరంగా ఆగిన రాజసముద్రం బ్రిడ్జి

ABN , First Publish Date - 2020-12-02T05:14:40+05:30 IST

అర్ధంతరంగా బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి, వెదురుగట్ట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

అర్ధంతరంగా ఆగిన రాజసముద్రం బ్రిడ్జి
రాజసముద్రం వాగు వద్ద నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని వినతి

కరీంనగర్‌ రూరల్‌, డిసెంబరు 1: అర్ధంతరంగా బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి, వెదురుగట్ట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.  దీంతో చామనపల్లి, వెదురుగట్ట గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2016 సంవత్సరంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలతో పను లు ప్రారంభించిన కంట్రాక్టర్‌ పిల్లర్ల వరకు పూర్తి చేసి ఆపి వేశాడు.  రాజస ముద్రం వాగుపై బ్రిడ్జితో పాటు, చామనపల్లి నుండి వెదురుగట్ట వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా వెదురుగట్ట నుండి బ్రిడ్జి వరకు 1 1/2 కి.మీటర్లు మాత్రమే తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. చామనపల్లి నుండి బ్రిడ్జి వరకు రోడ్డుతో పాటు,బ్రిడ్జిపై స్లాబ్‌ పనులు పూర్తి కాక పోవడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే దూర భారం తప్పడం లేదు.   బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడంతో ఐదు కిలోమీటర్లు దూరం చామనపల్లి నుండి బహదూర్‌ఖాన్‌పేట్‌ మీదుగా వెదురుగట్టకు వెళ్లాల్సి వస్తోంది. చొప్పదండి నుండి మీదుగా వరద నీరు వెదురుగట్టలోని రాజసముద్రం చెరువు నిండిన తర్వాత రాజసముద్రం వాగు ద్వారా చర్లబూత్కూర్‌ చెరువులోకి వాగు నీరు వెళ్తుంది. వర్షాలకాంలో వాగు పూర్తి స్థాయిలో ప్రవహించి రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఉంది. 

 రోడ్డు లేక పోవడంతో ఇబ్బందులు: కమల్ల ఎల్లయ్య, చామనపల్లి

చామనపల్లి, వెదురుగట్ట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణంతో ఉన్న రోడ్డును తీసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.  వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా తెగిపోవడంతో ఇతరుల పొలాల నుండి వెళ్లాల్సి వస్తోంది. రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

Updated Date - 2020-12-02T05:14:40+05:30 IST