-
-
Home » Telangana » Karimnagar » Anxiety with a can of insecticide
-
పురుగుల మందు డబ్బాతో ఆందోళన
ABN , First Publish Date - 2020-12-28T05:22:53+05:30 IST
తాము సాగు చేసుకుంటున్న భూమిని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన దళిత మహిళా రైతులు పంచా యతీ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బా, కిరోసిన్ బాటిల్‌తో ఆందోళన చేపట్టారు.

బోయినపల్లి, డిసెంబరు 27: తాము సాగు చేసుకుంటున్న భూమిని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన దళిత మహిళా రైతులు పంచా యతీ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బా, కిరోసిన్ బాటిల్‌తో ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం ప్రకారం.. 30 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఉమ్మెత్తుల నర్సింహా రెడ్డి వద్ద కన్నం అమృత ఐదెకరాల 20 గుంటలు, మల్లారపు కమల మూడె కరాల 20 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు. నర్సింహారెడ్డి మరణించడంతో అతడి కుమారులు విష్ణువర్ధన్‌రెడ్డి, విజయేం దర్‌రెడ్డి దౌర్జన్యంగా భూమిని అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం కిరాయి మనుషులను పంపి భూమిని దౌర్జన్యంగా దున్నారని, ఇదే మిటని ప్రశ్నిస్తే దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సాదా బైనామా ద్వారా దర ఖాస్తు చేసుకున్నామని తెలిపారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్య మని పురుగుల మందుడబ్బాను చేతిలో పట్టుకోవడంతో స్థానికులు అడ్డుకు న్నారు. విషయం తెలుసుకన్న పోలీసులు, ఇన్‌చార్జి తహసీల్దార్ నవీన్ న్యా యం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో ఉమ్మెత్తుల విష్ణు వర్ధన్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.