రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-18T04:50:02+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జీ జ్యోతి డిమాండ్ చేశారు.

- జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
పెద్దపల్లి టౌన్, డిసెంబరు 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జీ జ్యోతి డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీ భావం ప్రకటించి గురువారం పట్టణంలో విరాళాలు సేకరిం చారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాచేలా ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కేటాయించేలా చట్టాలను రూపొందించాలని సూచించారు. సేకరించిన విరాళాలను రాష్ట్ర కమిటీ ద్వారా జాతీయ రైతు సంఘాలకు అందజేస్తామని ఆమె పేర్కొ న్నారు. ఆమె వెంట స్వామి, శంకర్‌రెడ్డి, కొమురయ్య, రాజే శం, ఆంజనేయులు తదితరులున్నారు.