వైద్యం అందక మూగజీవాల రోదన

ABN , First Publish Date - 2020-03-23T10:01:56+05:30 IST

సకాలంలో వైద్యం అందక మూగ జీవాలు రోదిస్తున్నాయి. సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని గ్రామాలకు పశువైద్యం కరవుకావడంతో...

వైద్యం అందక మూగజీవాల రోదన

ఫోటో ఫైల్‌నెంబర్‌ : 58ఎస్‌ఆర్‌ఎస్‌22 చంద్రంపేటలో  గొర్రెలకు మందులు  వేస్తున్న కాపర్లు



  • - అర్భన్‌ గ్రామాల్లో కరువైన పశువైద్యం
  • - పశువులకు సూది మందులు వేస్తున్న రైతులు 


సిరిసిల్ల రూరల్‌, మార్చి22 : సకాలంలో వైద్యం అందక మూగ జీవాలు రోదిస్తున్నాయి. సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని గ్రామాలకు పశువైద్యం కరవుకావడంతో రైతులే పశువులకు సూది మందులు వేసుకుంటున్నారు. అర్భన్‌లోని ఏడు గ్రామాలు ఉండగా ఏ గ్రామంలో కూడా పశువైద్యశాలలు లేకపోవడంతో పశువులకు వైద్యం అందడంలేదు. సిరిసిల్లలో ఉన్న పశువైద్యశాలకు పశు వులను తీసుకువెళ్లి వైద్య చికిత్సలు చేయించడం రైతులకు భారంగా మారింది.


గతంలో ఉమ్మడి సిరిసిల్ల మండలం లో 34 గ్రామాలు ఉండగా తంగళ్లపల్లిలో ఉన్న పశు వైద్యశాల పరిధిలో ఈ ఏడు గ్రామాలు ఉంటుండగా అక్కడి పశువైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ పశువు లకు వైద్యం అందించారు. ప్రస్తుతం తంగళ్లపల్లి మండల కేంద్రంగా మారిపోవడంతో అక్కడ ఉన్న వైద్యశాలల్లో పనిచేసే సిబ్బంది తంగళ్లపల్లి మండలానికే పరిమిత మయ్యారు. దీంతో ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్‌ లో విలీనం చేయడంతో ఈ గ్రామాలవైపు పశువైద్య సిబ్బ ంది రాకపోవడంతో పశువైద్యం కరువైపోయింది. దీం తో రగుడు, చంద్రంపేట, ముష్ఠిపెల్లి, చిన్నబోనాల, పెద ్దబో నాల, పెద్దూర్‌, సర్ధాపూర్‌, జగ్గారావుపల్లె గ్రామాల్లో సుమారు వెయ్యి వరకు పశువులు ఉండగా గ్రామానికి ఐ దు వందల చొప్పున ప్రభుత్వం గొర్రెలను అందించింది. వీటికి వైద్యం చేసే వారు లేకపోవడంతో రైతులు, గొర్రెల కాపర్లు పశువులకు వైద్యాన్ని సొంతంగా అందిస్తున్నారు. 

 అందని సంచార పశువైద్యం..

గ్రామాల్లోని మూగజీవాలకు మెరుగైన వైద్యాన్ని సకా లంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్య వాహనాలు ఈ ఏడు గ్రామాల్లో కానరావడంలేదు. సిరిసిల్ల నియోజకవర్గం  ఒకే వాహ నా న్ని కేటాయించడంతో ప్రతిరోజు ఏదో ఒక మండలంలో తి రుగుతుండగా ఈ గ్రామాలకు ఇంతవరకు రాలేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు గ్రామాలలో పశు వులకు వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. 


పశువులకు రోగం వస్తే వైద్యం కరువు..

పశువులకు రోగం వస్తే వైద్యం చేసే సిబ్బంది కరు వైపోయారు. గ్రామాల్లో పశువైద్య బృం దాలు తిరుగ కపోవడంతో తామే మందులను కొనుగోలు చేసి సొంత గా పశువులకు వైద్యం అందిస్తున్నాం.

- పోచవేని ఎల్లయ్యయాదవ్‌, రగుడు

 గ్రామాల్లో పశువెద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి

పెద్దూర్‌లో 25మంది యాదవులు గోర్రెలు, మేకలనుపెంచుతున్నారు. ఈ గ్రామం తో పాటు మిగతా గ్రామాల్లో పశువైద్య శిబిరాలను నెలలో రెండు సార్లు ఏర్పాటు చేసి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాల వాహనాన్ని అన్ని గ్రామాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.                                      

- మెడుదుల దేవయ్యయాదవ్‌, పెద్దూర్‌


Updated Date - 2020-03-23T10:01:56+05:30 IST