ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-12-07T06:01:11+05:30 IST
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని వివిధ పార్టీల ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు.

సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని వివిధ పార్టీల ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లాలోని మండల కేంద్రాల్లో గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళి అర్పించారు. చందుర్తి మండలం రామన్నపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆవిష్క రించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్‌కు నివాళి అర్పించారు.