ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-12-07T05:20:54+05:30 IST
రాజ్యాంగ నిర్మాత డాక ్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత డాక ్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ యువత రాజ్యాం గ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్, దళిత సంఘాల నాయకులు అక్కపాక తిరుపతి, శ్రీనివాస్, బాపయ్య, చంద్రమౌళి, రాజ్‌కుమార్, మోబిన్, ప్రశాంత్, చంద్రశేఖర్, రవిందర్, పహీం, వంశీతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద భీంఆర్మీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బంకూరి సురుందర్ సన్నీ ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు మాటూరి శ్రీనివాస్, రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు.