అక్రమకార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి

ABN , First Publish Date - 2020-12-02T05:12:29+05:30 IST

నేరరహిత కమిషనరేట్‌ లక్ష్యంగా ముందుకుసాగుతూ అక్రమకార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

అక్రమకార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి
మాట్లాడుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి

పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 1 : నేరరహిత కమిషనరేట్‌ లక్ష్యంగా ముందుకుసాగుతూ అక్రమకార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని  పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమకార్యకలాపాల నియంత్రణకు స్థానిక పోలీసులతోపాటు వివిధ ప్రత్యేక విభాగాలకు చెందిన పోలీసులు ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిషేధిగ పొగాకు ఉత్పత్తులకు సంబంధించి స్థానిక వ్యాపారులకు సరఫరా చేసేవారిపై నిఘా ఉంచి పట్టుకోవాలని, అప్పుడే పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందన్నారు. నాసిరకం తినుబండారాలు, నకిలీ విడిభాగాల తయారీ, విక్రయాలపై కూడా దృష్టిని కేంద్రీకరించాలని పేర్కొన్నారు. వివిధ రకాల కేసులను నిర్ణీత గడువులోపు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైంకంట్రోల్‌ స్టేషన్‌(సీసీఎస్‌)ను బలోపేతం చేస్తామని, 80 శాతం కేసులను ఛేదించేలా లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని అన్నారు. సమన్లు, వారెంట్లను వేగవంతం చేయాలన్నారు. సీసీ కెమెరాల ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సీసీకెమెరాల ఏర్పాటులో భాగస్వాములను చేయాలన్నారు. కమిషనరేట్‌లో ఇప్పటికే 10 మండలాల్లో 100 శాతం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పూరత్యఇందని, మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్సాటుకు కృషి చేయాలన్నారు. రాత్రి వేళల్లో కమిషనరేట్‌ వ్యాప్తంగా వాహనాల తనిఖీలను కొనసాగించాలన్నారు. 

Updated Date - 2020-12-02T05:12:29+05:30 IST