పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలి

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

పంట అవశేషాలను భూమిలోనే కలియ దున్నాలని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ ఉమారెడ్డి అన్నారు.

పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలి
సేంద్రీయ ఎరువులను రైతులకు అందిస్తున్న ఏడీఆర్‌ ఉమారెడ్డి

 జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 5: పంట అవశేషాలను భూమిలోనే కలియ దున్నాలని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ ఉమారెడ్డి అన్నారు. శనివారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన వెల్దుర్తితో పాటు, వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన గుల్లపేట గ్రామాల్లో  ప్రపంచ నేల(మృత్తిక) దినోత్సవాన్ని పొలాస పరిశోధనా స్థానం, క్రిబ్‌ కో కంపెనీ, వ్యవసాయ కళాశాల, ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పరిశోధనా స్థానం ఏడీఆర్‌ ఉమారెడ్డి మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడు కునే పద్ధతులను రైతుల గురించి వివరించారు. భూసార పరీక్షల ఫలితంగా ఎరువులను వాడుకొని పంట సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా జీవ ఎరువుల ప్రాముఖ్యత, వర్మీ కంపోస్టు తయారీ విధానం గురించి రైతులకు వివరించి, పరిశోధన స్థానం తరుపున సేంద్రీయ ఎరువులను రైతులకు అందించారు. మట్టి నమూనా తీసే విధానాన్ని రోటరీ మల్బర్‌ పనితీరును రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. గుల్లపేట గ్రామంలో నిర్వహించిన  మృత్తిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళాశాల అసోసియేట్‌ డీన్‌ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు నేల స్వభావం తదితర అంశాలల్లో అవగాహన పెంచుకో వాలని సూచించారు. గుల్లపేట గ్రామ నేలల పోషక పటాలను విడుదల చేసి, 120 మంది రైతులకు భూసార పరీక్షల ఫలితాలు అందించారు. ఈ కార్య క్రమం లో గుల్లపేట, వెల్దుర్థి సర్పంచ్‌లు తిరుపతి, ప్రవీణ్‌, కల్లెడ పీఏసీఎస్‌ ఛైర్మె న్‌ సందీప్‌రావు, ఉపసర్పంచ్‌ తిరుపతి, కళాశాల అఽధ్యాపకులు డాక్టర్‌ సత్యనా రాయ ణరెడ్డి, అరుణ్‌కుమార్‌, శ్రవణ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, శ్రీకాంత్‌ , ఎల్లాగౌడ్‌, శాస్త్ర వేత్తలు రవి, రేవతి, మధుకర్‌రావు, సాధ్విరెడ్డి, క్రిబ్‌కో ఫీల్డ్‌ ఆఫీసర్‌ లక్ష్మీ నారా యణరెడ్డితో పాటు వెల్దుర్థి, గుల్లపేట రైతులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST