సాధించుకున్న రాష్ట్రం సమస్యలకు నిలయం

ABN , First Publish Date - 2020-09-06T07:23:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం దొరుకుందని భావిస్తే, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమస్యలకు నిలయంగా మారిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు...

సాధించుకున్న రాష్ట్రం సమస్యలకు నిలయం

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 05: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం దొరుకుందని భావిస్తే, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమస్యలకు నిలయంగా మారిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం(టీపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో నిరసన తెలుపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొని నిరసనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19తో విద్యావ్యవస్ధ కుంటుపడిందని అన్నారు.


దేశంలో విద్య, వైద్యం ప్రాథమిక హక్కు అనీ గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయలేకపోవడంతో , ప్రైవేట్‌ పాఠశాలల్లో నిరుపేదలు అభ్యసించడానికి అవసరమైన 25శాతం విద్యార్థులకు విద్య అందడం లేదన్నారు. ఆరేళ్ల తెలంగాణ రాష్ట్ర పాలనలో ప్రభుత్వం ఆఖరికి టెట్‌ పరీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం చొరవచూపడంతో పాటు వేతనాలు ఇతర విషయాల్లో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు కూడా రిటైర్మెంట్‌ సమయంలో పీఎఫ్‌, ఈపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌, టీపీటీఎఫ్‌ నాయకులు చంద్ర శేఖర్‌ రావు, ప్రవీణ్‌ చంద్ర, ప్రవీణ్‌ కుమార్‌, శేఖర్‌, విజయ్‌, కృపాకర్‌, గంగాధర్‌, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T07:23:00+05:30 IST