12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

ABN , First Publish Date - 2020-09-17T10:42:50+05:30 IST

మోసానికి పాల్పడిన కేసులో 12సంవత్సరాలుగా పోలీసులనుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రెండో ఠాణ సీఐ లక్ష్మిబాబు తెలిపిన వివరాల ప్రకారం..

12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 16: మోసానికి పాల్పడిన కేసులో 12సంవత్సరాలుగా పోలీసులనుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రెండో ఠాణ సీఐ లక్ష్మిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన పసుల దేవేందర్‌ మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామానికి చెందిన వ్యక్తిని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు పంపిస్తానని రూ.1 లక్షా 10వేలు తీసుకుని మోసం చేశాడు. ఈ మేరకు బాధితుడు 2005 లో కరీంనగర్‌ రెండో ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు న్యాయస్థానంలో కొనసాగుతుండగా నింది తుడు 2008 నుంచి కేసుకు కోర్టులో హాజరు కాకుండా తప్పిం చుకు తిరుగుతున్నాడు.


కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ కమ లాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల ను పరిష్కరించడంపై దృష్టిని కేంద్రీకరించిన పోలీసులు నింది తుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కరీం నగర్‌ రెండోఠాణా ప్రత్యేకబృందం పోలీసులు నిందితుడు పసుల దేవేందర్‌ ఆచూకీ కనుగొని మంగళ వారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ లక్ష్మిబాబు, కానిస్టేబుళ్లు రమేష్‌, పీ సంపత్‌కుమార్‌లను సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి అభినం దిస్తూ వారికి నగదు రివార్డులను ప్రకటించారు. 

Updated Date - 2020-09-17T10:42:50+05:30 IST