ఆటోను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2020-12-28T04:28:46+05:30 IST

కరీంనగర్‌ శివారులోని ఉజ్వలపార్క్‌ వద్ద మానేరు బైపాస్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొన్న కారు
ప్రమాదంలో ధ్వంసమైన ఆటో

ఆటో డ్రైవర్‌ మృతి

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 27: కరీంనగర్‌ శివారులోని ఉజ్వలపార్క్‌ వద్ద మానేరు బైపాస్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గౌతమినగర్‌ నుంచి ఎన్టీఆర్‌ చైక్‌ వైపు వెళుతున్న ఆటో(ఏపీ 15 డబ్ల్యు 2632)ను వెనుక నుంచి కారు(ఏపీ 15 ఏక్యూ 2727) అతివేగంగా డీకొట్టింది. దీతో చింతకుంటకు చెందిన ఆటో డ్రైవర్‌  భోగి రాజేశం(42) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఆటోలోని ప్రయాణికులు ఇద్దరు గాయపడగా కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌ ఒకటో ఠాణా పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-12-28T04:28:46+05:30 IST