ద్విచక్రవాహనం ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-01T06:06:29+05:30 IST

జగిత్యాల రూరల్‌ మండలంలోని అ నంతారం పొలాస గ్రామం మధ్యలో గల ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ద్విచక్రవాహనం మహిళను డీకొట్టిన సంఘటనలో సంఘంపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జయ(35) అనే మహిళ మృతి చెందింది.

ద్విచక్రవాహనం ఢీకొని మహిళ మృతి
నేరెళ్ల జయ (ఫైల్‌)

జగిత్యాల రూరల్‌ నవంబరు 30 : జగిత్యాల రూరల్‌ మండలంలోని అ నంతారం పొలాస గ్రామం మధ్యలో గల ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ద్విచక్రవాహనం మహిళను డీకొట్టిన సంఘటనలో సంఘంపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జయ(35) అనే మహిళ మృతి చెందింది. ఎస్సై సతీష్‌ కు మార్‌ తెలిపిన వివరాల ప్రకారం సంఘంపల్లి గ్రామానికి చెందిన జయ ఆమె భర్త పెద్దసాయిలుగౌడ్‌తో కలిసి ఉదయం జగిత్యాలలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. మధ్యాహ్నం స్వగ్రామం సంఘంపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. పొలాస, అనంతారం మద్యలో ఓ ఫంక్షన్‌హాల్‌ స మీపంలో మక్క కంకి కొనుక్కునేందుకు ద్విచక్ర వాహనం ఆపి రోడ్డు దా టుతున్న క్రమంలో జగిత్యాల నుంచి తక్కళ్లపల్లి వైపు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై వస్తున్న తోకల రాజేశం అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంతో జయను ఢీకొట్టాడు. దీంతో జయ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెం దింది. జయకు 3 నెలల క్రితమే పెద్దసాయిలుగౌడ్‌తో వివాహం జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-01T06:06:29+05:30 IST