మాజీ మంత్రి మాతంగి నర్సయ్యకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-09-03T09:01:18+05:30 IST

మాజీ మంత్రి మాతంగి నర్సయ్యకు పలువురు ఘన నివాళులర్పించారు. బుధవారం గోదావరిఖని కాకతీయగనర్‌లో మాతంగి నర్సయ్య

మాజీ మంత్రి మాతంగి నర్సయ్యకు ఘన నివాళి

 ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు        

 పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే చందర్‌


గోదావరిఖని, సెప్టెంబర్‌ 2: మాజీ మంత్రి మాతంగి నర్సయ్యకు పలువురు ఘన నివాళులర్పించారు. బుధవారం గోదావరిఖని కాకతీయగనర్‌లో మాతంగి నర్సయ్య గృహం లో ఆయన పార్థివదేహానికి పలువురు పూలమాలలు వేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌,  ఎ మ్మెల్సీ జీవన్‌రెడ్డి, మేయర్‌ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, గుమ్మడి కుమారస్వామి, కొం కటి లక్ష్మీనారాయణ, ఈర్ల కొమురయ్య అంతిమ యాత్రలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ మాతంగి నర్సయ్య 40 సంవత్సరాల నుంచి సు పరిచితులని, అనుభవజ్ఞుడని, ఎల్‌ఎల్‌బీ చదివి, బ్యాంకు ఉద్యోగిగా జీవితం ప్రారంభించి మంత్రి స్థాయికి ఎదిగారన్నా రు. రామగుండంలో అనేక సమస్యలను పరిష్కరించారని, దళితులకు ధైర్యం ఇచ్చిన మహానాయకుడని కొనియాడా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ నర్సయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.


మేడారం నియోజకవర్గ వాణిని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వినిపించిన తీరు మరువలేనిదని చెప్పారు. అంతిమాయాత్రలో కార్పొరేటర్లు కొమ్ము వేణు, మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, తానిపర్తి గోపాల్‌రావు, ఎల్లయ్య, బొడ్డు రవీందర్‌, సుందర్‌రావు పాల్గొన్నారు.


ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పం దించి సీఎస్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ లాం ఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు గాలిలో కి కాల్పులు జరుపగా, మంత్రి ఈశ్వర్‌, కోరుకంటి చందర్‌ దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేయించారు. 

Updated Date - 2020-09-03T09:01:18+05:30 IST