ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-06-22T10:45:17+05:30 IST

తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ మార్గదర్శి అని నగర మేయర్‌ వై సునీల్‌రావు అన్నారు

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 21: తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ మార్గదర్శి అని నగర మేయర్‌ వై సునీల్‌రావు అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి, పలువురు అధికారులు, ఉద్యోగులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కెట్‌లోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌(వోపా) ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - 2020-06-22T10:45:17+05:30 IST